నేటిగద్దర్ డిజిటల్ న్యూస్, చింతకాని ప్రతినిధి
భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే 194 వ వర్ధంతిని మండల పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల సీతంపేట నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయురాలు ఎస్.సుచేత అధ్యక్షత వహించారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సావిత్రి భాయి పూలే గురించి ఆమె చేసిన సేవ గురించి సవివరంగా వివరించారు. ప్రధానోపాధ్యాయురాలు సుచేత మాట్లాడుతూ మహిళలు ఇప్పుడు అన్నిరంగాలలో ఎదుగుతున్నారంటే మూలకారణం సావిత్రి భాయి పూలే మూలకారణం ఇప్పటి బాలికలు ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలని వివరించారు.ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు టి.సహదేవ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలు జి.నాగలక్ష్మి పర్యవేక్షణలో జరిగింది.ఈ సమావేశంలో ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,విద్యార్ధులు పాల్గొన్నారు.
Post Views: 29