నేటి గదర్ కరకగూడెం: పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసిన రేగళ్ల గ్రామపంచాయతీలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు కొమరం.వెంకటేశ్వర్లు, సనప.అశ్విని,జిజ్జా.నాగేశ్వరరావు అనే లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల పాడిన వరంగా ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచిస్తుందని ఆయన అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 42