నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి
చింతకాని మార్చి 12:
శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మినేని పాలెం లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష పాడ్స్, పెన్నులు వితరణ చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి జిల్ల బాధ్యులు ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిరంజీవి నాయుడు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 12