నేటి గదర్ న్యూస్, మార్చి 12, ఎర్రుపాలెం ప్రతినిది, సగ్గుర్తి ముత్యాల రావు
ఎర్రుపాలెం మండలం కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట రెండవ రోజు రిలే నిరాహార దీక్షలను దీక్షా శిబిరంలో కూర్చున్న నాయకులకు కార్యకర్తలకు ఎమ్మార్పీఎస్ &ఎంఎస్పి నాయకులకు పూలమాలలు వేసి రిలే నిరాహార దీక్షను బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు దేవరకొండ కోటేశ్వరరావు బిజెపి నాయకులు గరికపాటి పురుషోత్తం జనసేన మండల కోఆర్డినేటర్ మిరియాల నాగేశ్వరరావు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఈ రిలే నిరసన దీక్షను ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డాక్టర్ షమీ అత్తర్ ఇచ్చిన నివేదికను కులాల కూర్పులో లోపాలను సరిచేసి ఒకటి,రెండు,మూడు గ్రూపులుగా కాకుండా ఏబిసిడిలు గా వర్గీకరణ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట ప్రకారం గ్రూప్1 గ్రూప్2 గ్రూప్3 నియమకాల ఫలితాలను ప్రకటించటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడి లేకపోవడం తీవ్రంగా ఖండిస్తూ ఈ రిలే నిరాహార దీక్షను చేయడం జరుగుతుంది. అదేవిధంగా జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి ప్రత్యేకించి రెండు మంత్రి పదవులు ఇయ్యాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 10 వ తేదీ నుండి అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎంఎస్పి మండల అధ్యక్షులు గట్టి గుండె కిషోర్ మాదిగ పల్లె కంటి సుధీర్ మాదిగ ఆరుకుట్ల బాబురావు మాదిగ సగుర్తి ముత్యాల రావు మాదిగ ఏసోబు మాదిగ ఉప్పెల్లి జాన్ మాదిగ దేవరకొండ యేసు రత్నం మాదిగ లంక బాబురావు మాదిగ తదితరులు పాల్గొన్నారు