రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15 :- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మానెగల రామకిష్టయ్య నివాసంలో శనివారం నాడు హవేలీ ఘనపూర్ మండలం చౌట్లపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం పెద్దలు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవానికి హాజరుకావాలని అయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20 21వ తేదీలలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం,గణపతి పూజ అఖండ దీపారాధన రెండవ రోజు అగ్ని ప్రతిష్ట హోమ కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ముదిరాజ్ సంఘం నాయకులు పెద్దలు విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోచయ్య,శంకర్,రాములు సిద్దయ్య,లింగం,మహేందర్ సత్యనారాయణ పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 27