*మాదిగలను నమ్మించి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ*
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి*
హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 15.
స్థానిక మెదక్ పట్టణంలో
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్,ఎంయస్పి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ దీక్ష నేటికీ రెండవ రోజు చేరుకోగా ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మాసాయిపేట. యాదగిరి జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి యాదగిరి మెదక్ జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు. అస్తారు గళ్ళ బాలరాజు అధ్యక్షులు వెన్నెల సుధాకర్ జిల్లా అధికార ప్రతినిధి ఎమ్మార్పీఎస్. జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పుల పరమేష్ మాసాయిపేట మండల అధ్యక్షులు కార్యదర్శులు ప్రభాకర్ బిక్షపతి భాస్కర్ నాయకులు మొగిలి గుండ్ల శంకర్ మాదిగ సీనియర్ నాయకులు కొమ్ముశేకులు దండోల సామేలు మెదక్ పట్టణ ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభాకర్ దేవేందర్ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్
ఉసనగళ్ళ మురళి మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు
గార్లు హాజరై దీక్ష ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగలను నమ్మించి ఒకపక్క ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉంటున్నామని మాయమాటలు చెబుతూ మరోపక్క వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలను చేయడం సిగ్గుచేటు మొన్న డిఎస్సీ ఫలితాలలో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి మాదిగలకు న్యాయం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి మోసం చేయడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణనను అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని చెప్పుతూనే డిఎస్సీ మరియు ప్రస్తుతం గ్రూప్ 1,గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాల ఫలితాలను విడుదల చేసి మాదిగ మరియు ఉప కులాల ప్రజలకు తీవ్ర అన్యాయానికి గురి చేశారని మండిపడ్డారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మూడు గ్రూపులుగా కాకుండా నాలుగు గ్రూపులు (ఎబిసిడి) గా వర్గీకరణ చేసి జనాభా తమాషా ప్రకారం బిల్లు పెట్టాలని మరియు మాదిగలకు మంత్రి పదవులు రెండు ఇవ్వాలని తెలంగాణ టిఎస్పిఎస్ చైర్మన్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ బిల్లు పెట్టేంతవరకు దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.