రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15 :- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన రాగి నరేష్ అనారోగ్యంతో శనివారం నాడు ఉదయం మృతి చెందడం జరిగింది.అక్కన్నపేట గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి అంత్యక్రియల నిమిత్తం 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.నరేష్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అక్కన్న పేట గ్రామ అధ్యక్షులు చిట్టిమల్లి నరేందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు పాపయ్య గారి నరసింహులు,రామాయంపేట మండల యూత్ ఉపాధ్యక్షులు దొమ్మాట శ్రావణ్ గౌడ్,ఆర్ వెంకటాపూర్ గ్రామ యూత్ అధ్యక్షులు పండు,నాగరాజు,గొండ స్వామి,భూమ రమేష్ పాల్గొన్నారు.
Post Views: 137









