రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల సమయ పాలనపై కీలక నిర్ణయం తీసుకున్నది.ఈ క్రమంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు.ఆ తర్వాత పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అందిస్తారని పేర్కొన్నారు.ఇక పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయని పేర్కొన్నారు.ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పనిచేస్తారని తెలిపారు.ఈ ఒంటి పూట బడులు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.అలాగే ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు జూన్ 11 వరకు ఉంటాయని జూన్ 12న తిరిగి పాఠశాలలు పున్న ప్రారంభం అవుతాయని వెల్లడించారు.









