రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన తొంట సావిత్రి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ బాధితుల కుటుంబానికి వెళ్లి పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు బియ్యం మరియు 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.ఆయన చేసిన సహాయం మరువలేనిదని కుటుంబీకులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శంభుని రాజ్ కుమార్,తొంట దుర్గపతి,సైదాన మహేందర్ నిమ్మగళ్ళ మల్లేశం,బ్యాదరీ సిద్ధరాములు మరియు లీల గ్రూప్ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 163









