రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తూప్రాన్ మెడికల్ సూపరిండెంట్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా అయన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు డాక్టర్లు ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో పారిశుధ్య కార్యకలాపాలను ఎలా సిబ్బంది నిర్వర్తిస్తున్నారని పరిశీలించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు వైద్యం అందించే దిశగా డాక్టర్లు అన్ని రంగాల్లో కృషి చేయాలని ఆయన సూచించారు.30 పడకల ఆస్పత్రిలో నూతనంగా డాక్టర్లు,నర్సులు,సిబ్బంది నియామకం కోసం వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి విజిలెన్స్ అధికారి రవీందర్ సందర్శించారు.ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్థాలను చూసి తనిఖీ చేశారు.ఏదైనా నిల్వ ఉంచకుండా ప్రతి రోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.వారి వెంట ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లింబాద్రి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.









