★శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన భద్రాచలం టీపీసీసీ మెంబెర్ నల్లపు దుర్గాప్రసాద్
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై పీసీసీ మెంబెర్ నల్లపు దుర్గాప్రసాద్ గారు హర్షం వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పునర్జీవనానికి పునాది వేసిందని ఆనందించారు..రాష్ట్రాన్ని పునర్నించుకోవడంపై దృష్టి పెట్టారని అందుకే డాంబికాలకు పోకుండా వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ ను రూపొందించారని పేర్కొన్నారు..ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ శాఖ కు 24,438 కోట్ల రూపాయలు, విద్యుత్ శాఖ కు 21,221 కోట్లు, మరియు ఆరు గ్యారంటీల అమలుకు పద్దులో అధిక మొత్తం కేటాయించారన్నారు..అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రూపదిద్దుతుందని తెలిపారు.. అందుకే విద్య వైద్యం వ్యవసాయ సాగునీటి రంగాల అభ్యున్నతి సంక్షేమ అభివృద్ధిని సహకారం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తుందని వివరించారు.