◆సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రుల ఫోటోలకు పాలాభిషేకం
ఖమ్మం నగర 28వ డివిజన్ ప్రకాశ్ నగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని 28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల లక్ష్మీ వెంకన్న పాల్గొని ప్రారంభించారు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ పథకం నిరుపేదలకు ఒక వరమ్మన్నారు . ఆహార భధ్రతాకార్డులకు ఒక్కొక్కరికీ ఆరు కేజీలు , అన్నపూర్ణకార్డు లబ్ధిదారులకు పది కేజీలు , అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు ముప్పై కేజీల చొప్పున అందించనున్నట్లు తెలిపారు . కావున డివిజన్ లో ఉన్న లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రుల ఫోటోలకు పాలాభిషేకం చేశారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకాల వీరభద్రం , సుంకర సతీష్ వర్మ , జెట్టి లింగరాజు , కోండ్రు చైతన్య కుమార్ , అఫ్జల్ , ఆముదాల లక్మన్ , ఉప్పి రెడ్డి , బాశెట్టి నాగేశ్వరరావు , గాడుదల వెంకటేష్ , గంగరబోయిన రవి , బొడ్డు శ్రీను , బొడ్డు వెంకన్న , వీర్ల రమణ , ఆటో కనకయ్య తదితరులు పాల్గొన్నారు .