+91 95819 05907

ప్రకృతి వైపరిత్యాలు సైతం అధికమించి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించిన మణుగూరు ఏరియా కార్మికులకు స్వీట్ బాక్స్ లు అందించి వారిని ప్రోత్సహించాలి :నాగెల్లి

★ ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి

నేటి గదర్ న్యూస్,మణుగూరు రూరల్:
2024_25ఆర్థిక సంవత్సరానికి గాను ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 127.60 వేల టన్నుల సాధనలో ప్రకృతి పరంగా అనేక ప్రతి కూల వాతావరణాలు ఎదురైనప్పటికీ వాటిని అనుకూల పరిస్థితులుగా మలచుకొని సమష్టి కృషితో పూర్తి లక్ష్యాన్ని సాధించి మణుగూరు ఏరియా రికార్డ్ ను పదిల పరచడం అభినందనీయమైన అంశమని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు తెలిపారు. నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాల కోసం కష్టించి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు.గడిచిన ఐదు దశబ్దాలకు పైగా మణుగూరు ఏరియా కోల్ బెల్ట్ నందు ఎన్నడు కురువని వర్షాలు గడిచిన ఆగస్ట్ మాసం లో కురిసి ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడినప్పటికీ మైనింగ్ రంగంలో విశేష అపార అనుభవం కలిగి ఉన్న ఏరియా జి యం దుర్గం రామ చందర్ పక్కా ప్రణాళికలు రచించి దీక్ష దక్షత, పట్టుదల,అంకుటిత భావం ప్రదర్శించి ఏరియా ఉద్యోగులను,అధికారులను, సూపర్ వైజర్ లను కార్మికులను సమన్వయ పరచి వారందరినీ ఏకతాటి పైకి తెచ్చి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం అభినందనీయమైన అంశమని తెలిపారు.ఏరియా నందు జి యం దిశ నిర్దేశం, సమన్వయ పాలనతో కార్మిక వారి కుటుంబ సభ్యులకు మెరుగైన మౌలిక వసతులు అందించడం దానితో పాటు ఏరియా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కార్మిక సంక్షేమం,అభివృద్ధి అమలు లో పారదర్శక ద్వారా ప్రత్యేక దృష్టి సారించడం ప్రతి కూల వాతావరణం లో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల సాధన కు ఎంతగానో దోహద పడ్డాయని ఆయన తెలిపారు..2023_24 ఆర్ధిక సంవత్సరంలో కూడా ఏరియా నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించి మణుగూరు ఏరియా చరిత్రలోనే ఏనాడు రానటువంటి అత్యధిక లాభాలు 2315 కోట్లు దుర్గం. రామ చందర్ సారథ్యంలో సాధించడం జరిగిందని తెలిపారు.ప్రస్తుతం ఉన్న బొగ్గు డిమాండ్ మేర ఈ ఏడాది కూడా మణుగూరు ఏరియా 3 వేల కోట్లకు పైగా లాభాలు ఆర్జించే అవకాశాలు లేకపోలేదని దీని వెనుక కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరి శ్రమ దాగి ఉందని తెలిపారు.. అంకిత భావం ప్రదర్శించి మణుగూరు ఏరియా ను అగ్రభాగాన నిలబెట్టేందుకు కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియచేశారు. ప్రకృతి వైపరిత్యాలు చుట్టు ముట్టినప్పటికీ కూడా అధికారులు ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టకుండా రేయింబవళ్ళు కష్టించి పనిచేసి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించి కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టిన మణుగూరు ఏరియా కార్మికులకు స్వీట్ బాక్స్ లు అందించే అంశంలో యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఇజ్రాయిల్, రామాచారి, పవన్ కుమార్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !