+91 95819 05907

భూ భారతి చట్టంతోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి

★ఖమ్మంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి

ప్రజా ప్రభుత్వంలో భూ సమస్యలు లేని గ్రామాలే మా లక్ష్యం

గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కోసమే 10,954 మంది జీపీఓల నియామకం

మా ఆత్మగౌరవం కాపాడిన ప్రజా ప్రభుత్వానికి, జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారికి రుణపడి ఉంటాం…జీపీఓల రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్ర రావు

ఖమ్మం, ఏప్రిల్ 01

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న భూ భారతి చట్టంతోనే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి అసలైన మార్గమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఖమ్మం లోని ఎన్ ఎస్ పీ గెస్ట్ హౌస్ లో గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్ర రావు సారథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
… భూ భారతి చట్టం సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ప్రజా ప్రభుత్వం 10,954 గ్రామ పాలన అధికారుల పోస్టులను మంజూరు చేసిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని లచ్చిరెడ్డి అన్నారు. ప్రధానంగా భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పాటు భూ భారతి చట్టం-2025తో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని లచ్చిరెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని సుమారు 70లక్షల మంది రైతులకు క్షేత్రస్థాయిలో రైతులకు, ప్రజలకు సేవలందించేందుకు 10,954 మంది గ్రామ పాలన అధికారుల పోస్టులను మంజూరు చేశారని తెలిపారు. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను మళ్లీ మాతృసంస్థలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని పూర్ వీఅర్వోలు, వీఆర్ ఏ ల కుటుంబాలలో వెలుగులు నింపారని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా 33 సెలక్షన్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల ఏర్పాటు, తహశీల్దార్లు, ఆర్డీఓలు, జేసీలు కొల్పోయిన అధికారాలను భూభారతి చట్టంతో పునరుద్ధరించుకున్నామని లచ్చిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం అయిన రెవెన్యూ శాఖను బలోపేతం చేసినందుకు గాను సీఎం రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్‌రెడ్డికి లచ్చిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
గతంలో జీఓ నం.317తో రాష్ట్రంలో ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలకు సైతం చెట్టుకొక్కరికి పుట్టకొక్కరికి పోస్టింగ్‌ లు ఇచ్చారు. జేఏసీ ఉద్యమ ఫలితంగా స్పౌజ్‌, మెడికల్‌, తదితర కోణాలలో ప్రభుత్వం బదిలీలను చేసిందన్నారు. రాష్ట్రంలో కొత్త డివిజన్లు, కొత్త మండలాలలో పోస్టుల మంజూరు, జూనియర్‌ అసిస్టెంట్ల నుంచి డిప్యూటీ కలెక్టర్లు వరకు పదోన్నతులు సాధించడం, తహశీల్దార్లు, ఆర్డీఓలు, జేసీలు గతంలో కొల్పోయిన అధికారాలను భూభారతి చట్టం-2025తో పునరుద్ధరణ, పూర్వ వీఆర్ఏలు వేరువేరు జిల్లాలకు బదిలీ అయిన వారిని తిరిగి వారి సొంత జిల్లాకు తీసుకురావడం తెలంగాణ రాష్ట్ర అండతో రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఉద్యోగులకు అండగా నిలిచిందని అన్నారు. 10 ఏళ్ల తర్వాత 330 మందిని అధికారికంగా అవుట్‌సోర్సింగ్‌ టైపిస్ట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లుగా నియాకం చేయడం, 670 మంది ఫీల్డ్‌ అండ్‌ టెక్నికల్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రైవేట్‌ యాజమాన్యం నుండి ప్రభుత్వ కార్పొరేషన్‌కు బదిలీ చేయడం ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వ పెద్దలతో ఒప్పించామని లచ్చిరెడ్డి తెలిపారు.
గ్రామ పాలన ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
గరికె ఉపేంద్ర రావు మాట్లాడుతూ.. ‌ గత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వీఆర్వోలు, వీఆర్ఏ లను అన్యాయంగా అర్ధరాత్రి లాటరీ పద్ధతిలో వివిధ శాఖలకు బదిపలీ చేసి ఆత్మాభిమానం దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. లచ్చిరెడ్డి గారి సారధ్యంలో వీఆర్వోలకు పూర్వవైభవం సాధించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు డీఎస్ వెంకన్న, మంగీలాల్, సర్వే విభాగం ఉద్యోగుల సంఘం నాయకులు బుచ్చయ్య, టిజిటీఏ ఖమ్మం, భద్రాద్రి జిల్లా కన్వీనర్ కోట రవికుమార్, టీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, రాష్ట్ర సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహన్, టీజీటీఏ కోశాధికారి శ్రీనివాస్ శంకర్రావు, టిజీటీఏ రాష్ట్ర బాధ్యులు ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.గౌరవ ప్రింట్, & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నమస్కారం🙏,

ఖమ్మం నగరంలోని NSP గెస్ట్ హౌస్ లో మీటింగ్ హాలులో ఈరోజు, 01-04-2025 న మధ్యాహ్నం 3:00కు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది,

ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనే వారు…

రెవెన్యూ JAC చైర్మన్ గౌరవ శ్రీ *V లచ్చి రెడ్డి గారు*,
TVROWA రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్ర రావు,
డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ *కె రామకృష్ణ గారు*,
TGTA రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ *ఎస్ రాములు గారు*,
TGTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *గౌరవ శ్రీ రమేష్ పాకా గారు*,
TGTA రాష్ట్ర సెక్రటరీ జనరల్ గౌరవ శ్రీ *పూల్ సింగ్ చౌహన్ గారు* ,
TGTA మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు *గౌరవ శ్రీమతి రాధా మేడమ్ గారు*,
TGRSA రాష్ట్ర అధ్యక్షులు *గౌరవ శ్రీ భానాల రామిరెడ్డి*,
గారు,
TGRSA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *గౌరవ శ్రీ భిక్షం గారు*,
TGRSA మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు *గౌరవ శ్రీమతి సుజాత చౌహన్ గారు*,
CCLA యూనిట్ అధ్యక్షులు *గౌరవ శ్రీ రాంబాబు గారు*,
CCLA యూనిట్ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ *చైతన్య గారు*
CCLA యూనిట్ కోశాధికారి *గౌరవ శ్రీ మల్లేష్ గారు* ,
TGTA, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ గౌరవ *శ్రీ కోట రవికుమార్ గారు*
TVROWA జిల్లా అధ్యక్షులు చీమల నాగేంద్ర బాబు, ప్రధాన కార్యదర్శి బంక కృష్ణ, వజ్జ రామారావు, కిషోర్ కుమార్, బాలయ్య, వాంకుడోత్ వెంకటన్న, షేక్ జానీ మియా, పద్దం వెంగళరావు, పాయం వెంకటేశ్వర్లు,హైమత్, బంక భాస్కర్, బాలరాజు, శాంతారావు,R వెంకటేశ్వర్లు, నక్క భాస్కర్, k పాపయ్య,

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !