సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఆవునూరి మదన్న.
బాబు చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పిoచిన న్యూడెమోక్రసీ నేతలు.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ముదిగొండ గ్రామ నివాసి సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సానుభూతిపరుడు మాదారపు బాబు ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించడం జరిగింది.వారి కుటుంబాన్ని ఈరోజు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకత్వం పరామర్శించటం జరిగింది బాబు అన్న చిత్రపటానికి పూలమాల తో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ బాబు విప్లవోద్యమం వైపు ఆకర్షితుడైన విప్లవ రాజకీయాలను బలపరిచిన వ్యక్తి అని అన్నారు
మాదారపు బాబు గారు అనారోగ్య తో మరణించటo ఆయన మరణం బాధాకరం అని
వారి కుమారుడు ఉమాశంకర్ ఒక విప్లవ పార్టీ అయినా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కి అందించిన గొప్ప వ్యక్తిని కొనియాడారు అటువంటి వ్యక్తి మరణించడం విప్లవకారులకు విప్లవ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ ప్రగతిశీల యువజన సంఘం (PYL )ఖమ్మం జిల్లా కార్యదర్శి గొర్రెపాటి రమేష్ జిల్లా నాయకులు చిర్ర రవి ఐ ఎఫ్ టి యు ఖమ్మం జిల్లా అధ్యక్షులు సుభాన్ తదితరులు పాల్గొనీ నివాళులర్పించారు









