◆గౌడ సంఘం రాష్ట్ర నాయకులు అమరగాని వెంకన్న గౌడ్
ఖమ్మం : సమసమాజ స్థాపన కోసం సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో బహుజనులు ఐక్యంగా ఉద్యమించాలని గౌడ సంఘం రాష్ట్ర నాయకులు అమరగాని వెంకన్న గౌడ్ పిలుపునిచ్చారు . బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద గల పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి అమరాగాని వెంకన్న గౌడ్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలోనే దక్కన్ కోటపై మొదటిసారిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన అన్నారు . కుల , మత , వర్గ విభేదాలు లేని సమాజం కోసం సుమారు 350 ఏళ్ల క్రితమే పాపన్న గౌడ్ కృషి చేశాడన్నారు . గౌడ కులంలో జన్మించి ఆదిపత్య కులాల యొక్క అధికారాన్ని , బానిసత్వాన్ని దిక్కరించి దళిత బహుజనలను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన సేవలను కొనియాడారు . సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ సోదరులంతా ఐక్యంగా ముందుకు పోవాలన్నారు . ఈ కార్యక్రమంలో గౌడ మరియు గోపా ప్రముఖులు బోడపట్ల వెంకన్న గౌడ్ , బిచ్చాల తిరుమలరావు గౌడ్ , డా.బొల్లికొండ శ్రీనివాసరావు గౌడ్ , డా.కేసగాని రాజశేఖర్ గౌడ్ , పోతగాని కృష్ణారావు గౌడ్ , ఊడుగు శ్రీనివాసరావు గౌడ్ , మారగాని సుదర్శన్ గౌడ్ , తోడేటి దుర్గ ప్రసాద్ గౌడ్ , నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ , తాళ్లపల్లి రామకృష్ణ గౌడ్ , తోలుపునూరి దానయ్య గౌడ్ , పెద్దపోలు వెంకటేశ్వర్లు గౌడ్ , మారగాని పూర్ణచంద్రరావు గౌడ్ , చేబ్రోలు ఇంద్రసేన గౌడ్ , కప్పల మధు గౌడ్ , సింగం జనార్ధన్ గౌడ్ , బండి నాగేశ్వరరావు గౌడ్ , వీరేందర్ గౌడ్ , బాలకృష్ణ గౌడ్ , కుమిలి శ్రీనివాసరావు గౌడ్ , ఆంజనీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .









