సిపిఎం నాయకులు, విద్యార్థుల
అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ నిరసన గా ఖమ్మం లో ర్యాలీ,దిష్టి బొమ్మ దగ్ధం
ఖమ్మం : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలంపాటను ఆపాలని ప్రశ్నించిన విద్యార్థులు సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఏత్తివేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వర్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వర్రావు లు
డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు, విద్యార్థుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో సరిత క్లినిక్ సెంటర్ వద్ద దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం జరిగింది. అంత కు ముందు పార్టీ జిల్లా ఆఫీస్ సుందరయ్య భవన్ నుండి నిరసన ర్యాలీ ప్రాంభమై,సరిత క్లినిక్ వరకు కోన సాగుంది.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్ అధ్యక్షతన
జరిగిన సభలో
వారు మాట్లాడుతూ కంచా గచ్చిబౌలిలోని 400 ఎకరాల యూనివర్సిటీకు సంబంధించిన భూములను ప్రభుత్వం వేలంపాటను తక్షణమే ఆపి విశ్వవిద్యాలయానికి భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. భూమిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తే పర్యావరణం దెబ్బతింటుందని జీవ వైవిధ్యం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులో నూతన భవనాలు వసతి గృహాలు కోర్సులు తదితర అనేక అవసరాలకు ఉపయోగపడే భూములను విశ్వవిద్యాలయానికే కేటాయించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు ప్రజల న్యాయమైన డిమాండ్ ను ఆలోచన చేయకుండా ప్రశ్నించిన విద్యార్థులను రాజకీయ పార్టీలను నిరంకుశంతో అణచివేస్తుందని విమర్శించారు. యూనివర్సిటీకి సంబంధించిన భూముల పై ప్రభుత్వం అడుగుపెట్టి అర్హత లేదని అన్నారు భవిష్యత్తు లో విశ్వవిద్యాలయాలను పరిశోధన కేంద్రాలుగా మార్చి అభివృద్ధి చేయడం మానేసి యూనివర్సిటీలలోకి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులను ప్రోత్సహించడం ఏమిటి అని ప్రశ్నించారు ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని 400 ఎకరాల భూమి HCU కు అప్పగించాలని రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేసిన సిపిఎం నాయకత్వాన్ని విడుదల చేసి విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలను కలుపుకొని దీర్ఘ కాల ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
యూనివర్సిటీ భూములు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలని, ఈ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించి యూనివర్సిటీ మూలాలను దెబ్బతీయొద్దని, ప్రజాస్వామ్య పద్ధతులో శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని
పోలీసులను ఉపయోగించి ఎందుకు నిర్బంధిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి నిర్బంధాల ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచివేస్తామనుకుంటే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం
చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు
బుగ్గవీటి సరళ,M. సుబ్బారావు,
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్,బండి పద్మ , జిల్లా కమిటీ సభ్యులు నందిపాటి మనోహర్, S.నవీన్ రెడ్డి దొంగల తిరుపతిరావు, పిన్నింటి రమ్య, ఎస్ కే బషీరుద్దీన్, పార్టీ వన్ టౌన్, టూ టౌన్,3టౌన్ కార్యదర్శులు నాగుల్ మీరా,బోడపట్ల సుదర్శన్, భూక్యా శ్రీనివాస్,
పార్టీ కార్పోరేటర్ వెల్లంపల్లి వెంకట్రావు,జిల్లా నాయకులు ఆర్. ప్రకాష్, SK.సైదులు, మాచర్ల గోపాల్ K.అమరావతి, SFI జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్, SFI అధ్యక్షులు పి. సుధాకర్, పాపారావు, ఎస్ కే ఇమామ్, గుమ్మడి బిక్షం, ఎస్కే ఆఫ్జల్, శ్రీమన్నారాయణ, మాచర్ల సైదులు,
మాజీ కౌన్సిలర్ నర్రా రమేష్
భాగం అజిత, నైరుణిస్తా బేగం,
తదితరులు పాల్గొన్నారు. -ప్రకాష్









