+91 95819 05907

అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు : సీపీఎం

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది

జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

భూములు, అడవులు, పక్షులు, జంతువులు అందమైన ప్రకృతిని కాపాడాలి.

400 ఎకరాల భూమి విక్రయాన్ని విరమించుకోవాలి

విద్యార్థులపై లాటీ చార్జీ చేయడాన్ని ఖండిస్తున్నాం

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి, శ్రీనివాస్
వైరా :అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, లాటీ చార్జీలతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, యూనివర్సిటీల భూములు, అడవులు, పక్షులు అందమైన వృక్షాలు, ప్రకృతిని కాపాడాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విక్రయాన్ని విరమించుకోవాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలిసులు లాటీ చార్జీ చేయటాన్ని, విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన సిపిఐ(ఎం) పార్టీ, ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైరా రింగ్ రోడ్డు సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ జీవ వైవిద్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, లెకపోతే ప్రజల మనుగడ ప్రమాదంలో పడుతుందని, విభిన్న రకాల వృక్షాలు, పక్షులు, జంతువులు, జలచరాలు, క్షీరదాలకు నిలయమై హైదరాబాదుకు ఊపిరితిత్తులు లాగా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్మడాన్ని ప్రకృతి ప్రేమికులు, మేదావులు, ప్రజాస్వామ్య వాదులు వ్యతిరేకించాలని కోరారు. ప్రభుత్వం అమ్ముతున్న 400 ఎకరాల భూమిలో 734 రకాలకు చెందిన నాలుగు లక్షల వృక్షాలు, 223 రకాల జాతులకు చెందిన పక్షులు, నక్షత్ర తాబేళ్లు, జింకలు, దుప్పులు, నెమళ్లు‌ జీవ వైవిద్యంతో నివసిస్తూ ప్రజలకు స్వచ్చమైన ఆక్సిజన్ అందిస్తున్న అడవులు ఉన్నాయని తెలిపారు. యునివర్సిటీ అబివృద్ధి కోసం ఉపయోగించాల్సిన భూములను ప్రభుత్వం తమ మనుగడ కోసం అమ్ముకోవడం తగదని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మాయ మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరిస్తూ ప్రజా పోరాటాల మీద, నాయకుల మీద నిర్బంధం పెంచిందని విమర్శించారు. విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లల్లో నిర్బంధించి మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడాన్ని, శాంతి యుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలిసులు లాటీ చార్జీ చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థులు, నాయకుల మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన విద్యార్థులు, సిపిఎం నాయకులను వెంటనే బెషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, నాయకులు తోట నాగేశ్వరావు, పారుపల్లి కృష్ణారావు, తూము సుధాకర్, రాచభంటి భత్తిరన్న, హరి వెంకటేశ్వరావు, కామినేని రవి, సంక్రాంతి పురుషోత్తమరావు, యనమద్ది రామకృష్ణ, తాళ్లూరి నాగేశ్వరరావు, పారుపల్లి శ్రీనాథ్ బాబు, మాడపాటి వెంకటి, కురుగుంట్ల శ్రీనివాసరావు, వెల్పుల మైఖేల్, నల్లమల కోటేశ్వరావు, పాసంగులపాటి చలపతిరావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !