●నియంతలాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి, నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ అరెస్టులు చేస్తే ఊరుకునేది లేదు
●hcu భూములలో జేసీబీలను, బుల్డోజర్లను వెనక్కి పంపాలి*
●పి డి ఎస్ యూ జాతీయ నాయకులు నామాల అజాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్*
●పి డి ఎస్ యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం*
●విద్యార్థుల పై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో లాఠీ ఛార్జ్ ని ఖండిస్తూ పిడిఎస్ యూ రాష్ట్ర కమిటీపిలుపులో భాగంగా పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఎస్. అర్ &బి జి యన్ అర్ కాలేజీ ఎదురుగా దగ్ధం చేయడం జరిగింది.*
ఈ సందర్బంగా పి డి ఎస్ యూ జాతీయ నాయకులు నామాల అజాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ లు పాల్గోని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసిందని, నియంతృత్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో నిర్భందాన్ని , అహంకారన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీకి చెందిన 400 ఎకరాల భూములని కర్పొరేట్ సంస్థలకు వేలం వేయాలనే నిర్ణయాన్ని అభివృద్ధి పేరిట అన్యక్రాంతం చేసే కుట్రలో భాగమేనన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ ఆందోళనలు చేస్తున్న విద్యార్థుల పట్ల అలాగే యూనివర్సీటీ భూములు తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్న సమాజం పట్ల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మత్రి శ్రీధర్ బాబు అత్యంత దురుత్సాహకరమైన రీతిలో వ్యవహరించి వాఖ్యలు చేశారు. ఈ రోజు ఆ నాలుగు వందల ఎకరాలలో ఏమీ లేదని నిరూపించుకోవటం కోసం అక్కడున్న ఫారెస్టును తొలగించి భూములన్నింటినీ హద్దులు లేకుండా చెరిపివేయాలే పేరుతో జీవవైవిద్యాన్ని దెబ్బతీసేందుకు, మొక్కలను తొలగించటం కోసం జేసీబీలను బుల్డోజర్లను తీసుకుని వచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పోలీసు బలగాలను దింపి, బారీగేట్లను ఏర్పాటు చేయటంతో విద్యార్థులు తమ భూములను కాపాడుకోవటం కోసం ఆందోళన చేస్తున్న వారి పై లాఠీ ఛార్జ్ చేయడం ఇది అత్యంత అవమానకరమైన ఘటన. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ఎవరైనా వచ్చి ముఖ్యమత్రిని కలసి సమస్యలు చెప్పుకోవచ్చని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ రోజు విద్యార్థులని చూడకుండా అమ్మాయిలని చూడకుండా, జుట్టు పట్టి మరి, లాఠీ ఛార్జ్ చేసి, లాక్కుని పోయి, నిర్బందాన్ని ప్రయోగిసూ పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ వ్యాన్లలో ఎత్తేవేస్తూ అరెస్టు చేయటాన్ని పి డి ఎస్ యు తీవ్రంగా ఖండింస్తుందన్నారు.
తక్షణమే ఈ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. యూనివర్సీటీలో దింపిన పోలీస్ బలగాలను వెనక్కి పిలిపించాలి. జేసీబీ, బుల్డోజర్లను అక్కడి నుండి ఖాళీ చేయించాలి. హెచ్‌సీయూకు చెందిన భూముల వేలాన్ని అపాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ , రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వేలం వేసిన భూముల సర్కులర్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో విద్యార్థుల తరపున ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తాం అన్నారు.
ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యూ. జిల్లా నాయకులు వినయ్, యశ్వంత్, ప్రసాద్, అనేష్, నసీర్, వరుణ్, గణేష్, అలేఖ్య, కావ్య తదితరులు పాల్గొన్నారు.