– ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అంటే విద్యార్థుల హక్కులను కాలరాయడమేనా ! SFI
–
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి – SFI
– 400 ఎకరాల భూమిని యూనివర్శీటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.
–
*ఎస్ఎఫ్ఐ(SFI)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ.*
: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీకి చెందిన 400 ఏకరాల భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు పోరాడుతుంటే వారిని అక్రమంగా వీధి రౌడీలాగ లాక్కొని వెళ్ళి అరెస్ట్ చేయడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్య అని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు, కొప్పుల రవీందర్ అన్నారు.రేపు జరగబోయే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ ముట్టడి జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి వారు పిలుపునిచ్చారు. అనంతరం ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకులు భూపేందర్ మాట్లాడుతూ…. యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా భూములనే కొల్లగొట్టేందుకు సిద్ధమైతే భవిష్యత్తులో యూనివర్సిటీ ఉనికి ప్రమాదంగా మారుతుందని ప్రభుత్వాల నుండి ఎదురయ్యే ప్రమాదకరమైన పరిస్థితులను ముందుగానే గమనించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రయోగశారులకు అవసరమైన భూములు చేజారి పోతే భవిష్యత్తు తరాల విద్యార్థులకు యూనివర్సిటీ ఉనికి ప్రమాదం అని న్యాయబద్ధంగా 400 ఎకరాల భూముల రక్షణ కోసం శాంతియుతంగా నిరసన కొనసాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కి ఆ ప్రజాస్వామికంగా, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని వేల కోట్ల విలువైన హెచ్. సి. యు భూములను కార్పోరేట్ శక్తులకు దారదత్తం చేసేందుకై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నుతోందని అన్నారు. అక్కడ అడవులను చదును చేయాలనే పేరుతో బుల్డోజర్, జెసిబిలను దింపి చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఎన్నో వృక్ష , జంతు జాతులకు నిలయంగా ఉన్న ఆ భూములను వేలం వేయడం సరికాదన్నారు. జెసిబిలను అడ్డుకున్న విద్యార్ధి నాయకులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. విద్యార్థలపై నిర్బంధాన్ని ప్రయోగించటం, పోలీసు బలగాలతో యూనివర్సీటీని నిర్బంధించటం వంటి సంఘటనలకు నిరసనగా శాంతియుతంగా ప్రజాస్వామిక బద్దంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఆడవాళ్లను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని మరి ఈడ్చుకుంటూ వాహనాల్లో నిర్బంధించారని ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం అప్ ప్రజాస్వామికంగా విద్యార్థులపై అక్రమ అరెస్టులు పెట్టడం ఏంటి అని వారు ప్రశ్నించారు. మా పాలనలో నిర్బంధాలు ఉండవని అధికారంలో వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కంచెలు తొలగించి ఇప్పుడు ఏకంగా ఇండ్లలోకి వెళ్ళి మరీ అరెస్టు చేయటాన్ని వారి ప్రభుత్వం యొక్క నియంత పాలనకు నిదర్శనంగా చెప్పవచ్చు అని అన్నారు. హెచ్. సి.యు భూములను యూనివర్సిటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని లేకపోతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇటువంటి చర్యలతో విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలను ఆపలేరని ఖండించారు.