నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం జిల్లా,నేలకొండపల్లి మండలం,కట్టు కాచారం గ్రామం లో గల యు పి ఎస్ స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు 50 మధ్యాహ్న భోజన ప్లేట్లు బహుకరించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువు లో మంచిగా రాణించి భవిష్యత్ లో ఉన్నత స్థాయి చేరుకొని,ఊరికి మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల.సీతారాములు,ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎన్ పీ చారి,కళ్లెం.శేష్ రెడ్డి,ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,గ్రామ సెక్రటరీ,గ్రామ పెద్దలు పుల్లయ్య,సైదులు నాయక్, పీరు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 96









