నేటి గద్దర్ న్యూస్, గుండాల: శ్రీరామ సీడ్స్ తో రైతులకు అధిక దిగుబడి వస్తుందని శ్రీరామ సీడ్స్ మేనేజర్ వెంకన్న అన్నారు.
ఆళ్లపల్లి మండలం జిన్నలగూడెం గ్రామంలోని శ్రీ రామ సీడ్స్ రైతు ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా సేల్స్ మేనేజర్ ఏం. వెంకన్న మాట్లాడుతూ శ్రీరామ సీడ్స్ వెరైటీ అయిన ఎస్ఆర్ఎంచ్-609 మొక్కజొన్న అధిక ఓలిపిడి శాతం కలిగి ఉంటుందని, కండి చివరి వరకు గింజలు మరియు సమానమైన కండెలు ఉంటాయని బరువైన గింజలతో అధిక దిగుబడి ఇస్తుందన్నారు. వైరస్ తెగుళ్లను, నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకుంటుందని రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, డీలర్స్ మరియు శ్రీరామ సీడ్స్ ప్రతినిధులు కె. శేషు, ఏస్. నాగేశ్వరరావు, ఎం. ఉమేష్, పి. రవివర్మ పాల్గొన్నారు
Post Views: 81









