+91 95819 05907

ప్రభుత్వ పథకాలు జర్నలిస్టులకు కూడ ఇవ్వండి.

నేటి గదర్ న్యూస్ మంగపేట. వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షుడు కటుకూరు సాంబశివరావు మంగపేట .
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు జర్నలిస్టు సంక్షేమంపై దృష్టి సారిస్తామని ఎన్నికల సమయంలో హామీలే తప్ప నేటికీ నెరవేరిందేమి లేదని మంగపేట మండల వర్కింగ్ జర్నలిస్టుల సంగం అధ్యక్షుడు కటుకూరు సాంబశివరావు అన్నారు.గత ప్రభుత్వం పది సంవత్సరాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిందని ప్రస్తుత ప్రజా ప్రభుత్వంపై నమ్మకంతో జర్నలిస్టులున్నారని ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చి ఆదుకోవాలన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలోను ఉద్యమం ఉప్పెనలా మారడానికి జర్నలిస్టులదే ప్రధాన పాత్ర అని గుర్తుచేశారు.ఎన్నో సంవత్సరాలుగా అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వాలు ప్రకటనలు చేయడంతో విని ఆనందపడటం తప్ప నేటికీ ఒరిగిందేమీ లేదన్నారు.గతంలో ప్రతిపక్ష శాసనసభ్యురాలుగా ధనసరి అనసూయ (సీతక్క) ఉన్నప్పుడు స్థానిక జర్నలిస్టులకు అండగా నిలిచి కేటాయించాల్సిన భూమిని సైతం పరిశీలించడం జరిగిందని కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడడంతో మరింత జాప్యం నేటికీ కొనసాగుతుందన్నారు.మంత్రి సీతక్కకు ఈ విషయం పై పూర్తి అవగాహన ఉన్నందున మరికొంత దృష్టిసారించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పెద్దన్న పాత్ర పోషించే జర్నలిస్ట్ లను హక్కునచేర్చుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.ముఖ్యమంత్రి తరువాత మంత్రిమండలిలో అంత ప్రాధాన్యత గల నాయకురాలిగా ఈ ప్రాంత శాసనసభ్యురాలే కావటంతో మొదటగా ములుగుజిల్లాలో ఉన్న జోర్నలిస్ట్లు ఇక తమ సమస్యలు పరిస్కారమయ్యాయని ఆనందపడ్డారని నేటికీ ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. జర్నలిస్టులవి గొంతెమ్మ కోరికలేమి కాదని రాష్ట్రంలో కొందరు నాయకులు తమ నియోజకవర్గాలలో ఇదివరకే పరిష్కార మార్గాలు చూపారన్నారు ప్రభుత్వం దృష్టి సారించి అర్హత కలిగిన జర్నలిస్టుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !