రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన మైలారం రమేష్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 32000/- రూపాయలు గట్టగారి లతకు 17500/- రూపాయల చెక్కులను మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు గురువారం రోజు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాలకు ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని అన్నారు.ఈ చెక్కులు రావడానికి సహకరించిన ఎమ్మెల్యే రోహిత్ రావు కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కమ్మరి రమేష్ చారి,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 98









