రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 3:- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూములను కాపాడేందుకు అక్కడకు వెళ్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు ముందస్తుగా గురువారం రోజు ఉదయం నుంచే అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లలో ఉంచారు.ఈ క్రమంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడు శశికాంత్ ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ హెచ్సీయూలో భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు.విద్యార్థి హక్కులపై దాడి చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.క్యాంపస్‌లో 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా విద్యార్థులపై లాఠీఛార్జిలు చేయడం, భూములను వేలం వేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో విఫలమై ప్రభుత్వ భూములు అమ్మడం మొదలుపెట్టారని దుయ్యబట్టారు.భూముల అమ్మకాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని,లేనట్లయితే విద్యార్థి సంఘాల తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.









