★మీడియా ఛానల్స్‌కు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విజ్ఞప్తి
నేటి గదర్ వెబ్ డెస్క్:
భారత మినిస్ట్రీ అండ్ డిఫెన్స్ శాఖ భారత పౌరులకు,మీడియా ఛానల్స్‌కు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కీలక సూచన చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు భద్రతా దళాలకు చెందిన రక్షణ కార్యకలాపాలు, కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆపాలని సూచించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్.
అలాంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల భద్రతా దళాల ఆపరేషన్స్‌కు వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆ ప్రకటనలు తెలిపింది. తమ ప్రకటనకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Post Views: 180









