నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే 09: నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అశ్వరావుపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పి నాగరాజు రెడ్డి వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం, అశ్వరావుపేటలోని బిసిఎం రోడ్డులో ఉన్న హెచ్పి పెట్రోల్ బంకు వద్ద ఎస్సై టీ యయాతి రాజు సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఊట్లపల్లి వైపు నుంచి మూడు బైకులుపై అశ్వరావుపేట వైపు వెళ్తున్న ఏడుగురు యువకులు అనుమానస్పదంగా కనిపించడంతో నిలిపి తనిఖీలు చేశారు. దీంతో వారి వద్ద 2.75 లక్షలు విలువైన 5.5 కేజీల గంజాయి లభ్యమైంది. మూడు బైకులు, 6 సెల్ ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. విచారణ చేపట్టి నిందితులు అశ్వారా పేటకు చెందిన షేక్ ఫిరోజ్ ఖాన్, గండికోట ప్రభు కుమార్, పసుపు లేటి గోపి చంద్(శ్రీను), ఏపీలోని జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన పుట్టా జగదీష్, గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన తిరువీధుల కార్తీక్, హైద్రాబాద్ లోని చంపాపేట్ ప్రాంతానికి చెందిన బుల్లా సంజయ్ లను అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన గంజాయి వ్యాపారి రాము పరారిలో వున్నాడని సీఐ తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్సై రామూర్తి, ట్రైనీ ఎస్సై అఖిల, సిబ్బంది నాగేంద్రరావు, హరిబాబు, కృష్ణ ప్రసాద్, పీ రమేష్ రావు, రామకృష్ణ, నరేష్ బాబు, ఎం బానుచందర్, ఎన్ వెంకటేశ్వరావు, బీ సంతోష్ పాల్గొన్నారు.









