+91 95819 05907

ఖమ్మంలో చైతన్యపరిచిన మాజీ సైనికుల మాక్ డ్రిల్.

— యుద్ధం వచ్చినప్పుడు ముందస్తు పౌర రక్షణపై అవగాహన పెంచిన సన్నివేశాలు.

—సెల్ఫ్ డిఫెన్స్ , ఫైర్ సేఫ్టీ , బ్లాక్ అవుట్ , ప్రధమ చికిత్స లపై అబ్బురపరిచిన సన్నివేశాలు.

–పర్యవేక్షించిన మాజీ సైనిక ఉద్యోగి ఎస్ ఎం అరుణ్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం,మే9, ఆంధ్ర ప్రభ.

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యుద్ధం వచ్చినప్పుడు పౌరులు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలను వివరిస్తూ శుక్రవారం స్థానిక ఎన్ ఎస్ సి కాలనీ హై స్కూల్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మాజీ సైనికులు నిర్వహించిన సన్నివేశాలు అందరినీ చైతన్య పరిచాయి. మాజీ సైనిక ఉద్యోగుల ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి ఎస్ఎం అరుణ్ పర్యవేక్షణలో నిర్వహించిన యుద్ధ ముందస్తు పౌర రక్షణ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచి అవగాహన పెంచాయి. శత్రువులు బాంబులు వేసి భవనాలకు మంటలు అంటుకున్నప్పుడు పౌరులు ధైర్యంగా ఉండి ఆ మంటలనుంచి బయటపడే సన్నివేశాన్ని ఎస్ఎం అరుణ్ రూపొందించి ప్రదర్శించారు. మంటల్లోంచి బయటపడి గాయాలతో ఉన్నవారికి ప్రధమ చికిత్స చేసే విధానాన్ని వివరించారు. బాంబు దాడులు జరిగినప్పుడు, విపరీతంగా గాయపడినప్పుడు
వెనువెంటనే ప్రధమ చికిత్స చేసే విధానాన్ని తెలియజేశారు. యుద్ధం సంభవించినప్పుడు రాత్రిపూట నగరాల ఉనికి, గ్రామాల ఉనికి శత్రువులకు తెలియకుండా రాత్రిపూట అందరూ విద్యుత్ను పూర్తిగా ఆపు చేసి ఎమర్జెన్సీ బ్లాక్ అవుట్ నిర్వహించాలని చైతన్యం కలిగించారు. నీళ్లలో పడినప్పుడు, వరదలు సంభవించినప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులతో ముందస్తుగా ఎమర్జెన్సీ లైఫ్ జాకెట్ లను తయారు చేసుకునే విధానాన్ని మాజీ సైనికులు తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు గంటలపాటు మాజీ సైనికులు, సైనికులు, ఎన్సిసి క్యాడెట్లు ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించారు. వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 150 మంది ఎన్సిసి క్యాడెట్లు, యువతి యువకులు, 20 మంది ఆర్మీ జవాన్లు, 50 మంది మాజీ సైనికు ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, అడ్వకేట్లు, వివిధ పాఠశాలల, కళాశాలల కరస్పాండెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి సుబేదార్ మేజర్ బహుదూర్, జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్ కుమార్, ఆర్పిఎఫ్ సిఐ , మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ప్రతినిధులు , విద్యార్థి సంఘాల నాయకుడు వెంకటేష్, యువ అడ్వకేట్ నాళ్ల భానుచందర్, తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !