– సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న
–
పినపాక
లౌకికవాదాన్ని కాపాడాలంటే, ప్రతి ఒక్కరూ మతతత్వాన్ని నిస్సందేహంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న అన్నారు. శుక్రవారం ఫాసిజం మీద విజయం సాధించిన 80 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఎం మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్ అధ్యక్షతన పినపాక మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను నాశనం చేయడమే లక్ష్యం అని ఆయన ఆరోపించారు. భూగోళం నుండి కమ్యూనిజం గురించి పెట్టాలని హిట్లర్ భావించి ప్రజా వ్యతిరేకతకు గురై తనకు తానే ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేటి ప్రభుత్వానికి గొడ్డలి పెట్టు అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక ,ప్రజా వ్యతిరేక విధానాలను అమలుపరుస్తూ ప్రజా వ్యతిరేకతకు గురవుతుందన్నారు. బిజెపి ఒక మతతత్వ పార్టీ అని మండిపడ్డారు. ఫాసిజం మీద విజయం సాధించిన 20వ వార్షికోత్సవాన్ని భారీ ఎత్తున జరపడానికి రష్యా సంసిద్ధంగా ఉందన్నారు. మతత్వ పార్టీలను తరిమికొట్టకపోతే భవిష్యత్ భారత జాతికే ముప్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మడివి రమేష్, నట్టి శంకరయ్య,సీపీఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు









