+91 95819 05907

భారత్, పాక్ యుద్ధం: జిల్లాలోని ప్రభుత్వరంగ మరియు ప్రైవేట్ పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలి:ఎస్పీ

★భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణ నేపథ్యంలో జిల్లాలోని పరిశ్రమలు,కంపెనీల భద్రతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పరిశ్రమల భద్రతాధికారులతో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో పరిశ్రమల యాజమాన్యాలు మరియు భద్రతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.అశ్వాపురం భారజల ఉత్పత్తి కేంద్రం,సారపాక ఐటిసీ, KTPS,BTPS మరియు NAVA లిమిటెడ్ కంపెనీల భద్రతాధికారులు మరియు సంబంధిత పోలీసు అధికారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా పరిశ్రమలు, కంపెనీలలో ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న నియమ నిబంధనలను పాటిస్తూ దానికనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు.అలారం సిస్టమ్ విధానాన్ని తమ కంపెనీల ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ చేయాలని తెలిపారు.తమ ప్రాంతాల్లోని ప్రతి ప్రదేశంలో సీసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.పరిశ్రమల,కంపెనీల ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద ఇతర వ్యక్తులు లోనికి ప్రవేశించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.అదేవిధంగా దొంగతనాలు జరగకుండా తమ వంతు నిఘా ఏర్పాటు చేసుకుని పోలీస్ వారికి సహకరించాలని కోరారు.తమ తమ పరిసర ప్రాంతాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.నిషేదిత మావోయిస్టుల కార్యకలాపాల పట్ల కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులకు సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని పరిశ్రమలు,కంపెనీల వద్ద గస్తీని ముమ్మరం చేయాలని సూచించారు.అత్యవసర సమయంలో ప్రజలు పాటించాల్సిన విషయాలపై అవగాహన కల్పించాలని కోరారు.

ఈ సమావేశంలో భారజల కేంద్రం కమాండెంట్ అమిత్ కుమార్, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సీఐలు వెంకటేశ్వర్లు,అశోక్ రెడ్డి,ఐటిసీ సెక్యూరిటీ ఆఫీసర్ మనీష్ శర్మ,KTPS అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్,BTPS అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !