రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 9:- మెదక్ జిల్లా రామాయంపేట పురపాలక సంఘం 2025-26 ఆర్థిక సంవత్సరమునకు తై బజారు వేలం పాట వేయుటకు పురపాలక సంఘం కమిషనర్ ఎం.దేవేందర్ శుక్రవారం నాడు ప్రకటన జారీ చేశారు.ఇందు మూలముగా రామాయంపేట పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా 2025-26 ఆర్థిక సంవత్సరమునకు తేది 16-05-2025 నుండి తేది 15-05-2026 వరకు తై బజారు వసూలు చేయుటకు ఈ దిగువ తెలిపిన సందర్బం ద్వారా వేలం నిర్వహించగా ఇట్టి వేలములో ఎవరు డిపాజిట్ చెల్లించనందున వేలం పాట కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడిందని తెలిపారు.కావున తిరిగి ఈ నెల 12న సోమవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు రామాయంపేట పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో వేలం పాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.కావున ఆసక్తిగల వారు ఉదయం 10 గంటల వరకు సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించి ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవలసినదిగా అయన తెలియపరచారు.









