నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం కాల్వ ఒడ్డు శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి ఆలయం నందు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఖమ్మం నగర అష్టదిక్కుల వైపు ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయాల విశిష్టత కరపత్రలను ఆవిష్కరించడం జరిగింది . ఈ సందర్భంగా అధ్యక్షులు బోనాల రామకృష్ణ మాట్లాడుతూ కలియుగంలో మానవాళి అందరూ జన్మసార్థకం చేసుకోవడానికి ఉన్నది ఒకటే మార్గం భగవన్నామస్మరణం మాత్రమే . మనదేశ , సైన్య , స్వీయ రక్షణ కొరకు మే నెల 22 గురువారం శ్రీ హనుమాన్ జయంతి వరకు ప్రతి గుడిలో , ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భక్తిశ్రద్దలతో హనుమాన్ చాలీసా ఒకసారైనా చదవండి , మన స్తంభాద్రి నగరానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది , సాక్షాత్తు ఆంజనేయస్వామి వారు ప్రజల క్షేమం కోరి అష్టదిక్కులలో స్వయంభూగా వెలసి ఉన్నారు , ప్రతీ నెల స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర రోజు ఈ ఆలయాలు దర్శనం చేసుకొని తరించండి అని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా ధర్మ ప్రసార వేంకట రాణా ప్రతాప్, జిల్లా సత్సంగ వనం రామ కిషన్, మహిళ ప్రముఖ నాగమణి ,దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అర్చకులు ఎస్ బి కృష్ణమాచార్యులు , ఎన్ హరికృష్ణ శర్మ , ఫణి ఆచార్యులు , బి రాజారావు , ముడుంబై పవన్ కుమార్ చార్యులు , శేఖర్ శర్మ , చిట్టా రాధాకృష్ణ శర్మ , ప్రసాద్ శర్మ , శ్రీనివాస్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు .









