రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యవసాయం అధికారి ఏఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త పథకాలు మరియు పిఎం కిసాన్ పథకాలు ముందు ముందు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు.ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం తన సమీపంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి అక్కడ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.దీనికి కావలసిన పట్టా పాస్ బుక్కు ఆధార్ కార్డు ఓటీపీ కోసం తమ ఫోన్ వెంట తీసుకొని రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు.
Post Views: 211









