రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీ సమస్యలపై నిరంతరం దృష్టి ఉంటుందని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత రావు అన్నారు.అయన శుక్రవారం నాడు కెసిఆర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ లోని సమస్యలపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు.శుక్రవారం కాలనీకి విచ్చేసిన ఆయన కాలనీ అంతా తిరిగి సమస్యలపై వివరాలు తెలుసుకున్నాడు.కాలనీలోని పొంగిపొర్లుతున్న డ్రైనేజీలను బాగు చేయిస్తానని తెలిపారు.ఎమ్మెల్యే రోహిత్ రావుతో మాట్లాడి కాలనీలో ఉన్న సమస్యలు ప్రధానంగా మురికి కాలువలు ఇంటర్నల్ రోడ్స్ వేయిస్తానని పేర్కొన్నారు.అయన వెంట డిజి శ్రీనివాస శర్మ,కట్ట ప్రభాకర్ ఎల్లాగౌడ్,తుంగల వెంకటి నరసింహులు కాలనీవాసులు తదితరులు ఉన్నారు.
Post Views: 446









