నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన విశాల హృదయాన్ని మరోసారి చాటుకున్నారు.
బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని ఉన్న ఊరు వదిలి గల్ఫ్ బాట పట్టిన నల్లగొండ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అక్కడ అకాల మృత్యువుకు లోనయ్యారు.అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చే స్థోమత లేక కుటుంబ సభ్యులు ఎంపీ రవిచంద్రను సంప్రదించడంతో ఆయన వెంటనే స్పందించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.మరిన్ని వివరాల్లోకి వెళితే… నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన శ్రీరాములు బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లారు.ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన రియాద్ లోని ఒక ఆస్పత్రిలో చేరి వైద్య సేవలు పొందుతూనే తుది శ్వాస విడిచారు.విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో శ్రీరాములు మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించడం ఎలాగో,ఎవరిని కలవాలో,అందుకు ఎంత ఖర్చవుతుందో తెలియక, ఆర్థిక స్థోమత లేక దిక్కుతోచని పరిస్థితుల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకుల సాయంతో ఎంపీ వద్దిరాజు రవిచంద్రను సంప్రదించడం జరిగింది.ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి వారిని ఓదార్చి మనోధైర్యాన్నిస్తూ, అందుకు అవసరమైన అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ తగు ఏర్పాట్లు చేశారు.ఇందుకు గాను ఖర్చైన సుమారు 3 లక్షలు రూపాయలను ఎంపీ రవిచంద్ర భరించారు.దీంతో మృతదేహం విమానంలో హైదరాబాద్ ,ఆ తర్వాత బుధవారం రాత్రి స్వస్థలం వెలిమినేడు చేరింది.శ్రీరాములు కుటుంబ, సభ్యులు, బంధుమిత్రులు,స్థానికులు ఎంపీ వద్దిరాజుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.









