నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి:
కారేపల్లి పట్టణం, శుక్రవారం,రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరీలో నిజమైన లబ్ధిదారులకు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా సంక్షేమ పథకాల అమలు కార్యక్రమంలో అర్హలకు మాత్రమే ఇవ్వాలని, వీటి మంజూరులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండరాదని బి ఆర్. ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసద్దీన్ డిమాండ్ చేశారు. శుక్రవారంనాడు కారేపల్లి లో పత్రికా ప్రకటన విడుదల చేసిన . ఈ సందర్భంగా, వారు మాట్లాడుతూ, పేదలు, అతినిరుపేదలైన ప్రజలకు నివాసం ఉండుటకు ఇండ్లులేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారికి సహాయం చేస్తామని ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విధి విధానాలను పాటించడం లేదని ఫలితంగా అర్హులకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలను అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు తమకు దగ్గరగా ఉన్న బంధు వర్గాలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంజూరు చేసే విధంగా పైరవీలు చేస్తున్నారని నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత,వాటి ప్రకారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలను అర్హులకు చెందే విధంగా అధికారులు పర్యవేక్షణ చేయాలని వారు డిమాండ్ చేశారు. సంబంధం లేని పైరవీకారులు జోక్యం చేసుకొని పథకాలన అర్హులకు చెందకుండ చేయడం సరైనది కాదని, గ్రామ సభలలో అధికారులు కట్టుదిట్టమైన పద్ధతులలో నిర్వహించాలని, పైరవీకారులను గ్రామసభలలోకి రానివ్వకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అర్హత కలిగిన నిరుపేదలు ఉన్నప్పటికీని, సంక్షేమ పథకాలను అధికారులు ఎంపిక చేయటంలో అవకతవకలు జరిగితే తక్షణమే వాటిని పరిష్కరించాలని బి ఆర్ ఎస్ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌస్ ఉద్దీన్ డిమాండ్ చేస్తున్నారు.









