రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 16:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని వినియోగించుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు.విద్యార్థులు దైనందిన జీవితంలో పాటించాల్సిన నియమాల గురించి తెలియజేశారు.విద్యార్థులు చదువుతోపాటు వివిధ రకాల విషయాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.యోగ, చిత్రలేఖనం మరియు క్రీడల వల్ల భవిష్యత్తులో కలిగే ఉపయోగాలను విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన పిటిఇలు మల్లేశం, కవిత,యోగ శిక్షకులు భరత్, డ్రాయింగ్ టీచర్ యాదమ్మలను అభినందించారు.శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, నోట్ బుక్స్ మరియు స్నాక్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఎంఐఎస్ సంతోష్, ఉపాధ్యాయులు రాధిక, జయ తదితరులు పాల్గొన్నారు.









