రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 16:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో నందు బుచ్చిరెడ్డి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ క్రింద బాధిత కుటుంబానికి 10,500/-రూపాయల చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బాధిత కుటుంబాల నిరుపేద ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఇందుకు ముఖ్యమంత్రి వర్యులకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిడి సిద్ధరాములు,పిఎసిఎస్ డైరెక్టర్ నందు మైపాల్ రెడ్డి,గడ్డం సురేష్, నందు రాజిరెడ్డి,నందు నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 120









