*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, సింగేంట విత్తనాలతో రైతాంగానికి అధిక దిగుబడి లభిస్తుందని సకంపెనీ దక్షిణాది డి ఎం జగదీష్ దాస్ తెలిపారు.
శనివారం గుండాల మండల కేంద్రంలో సింజంట మొక్కజొన్న విత్తనాల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన రైతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ 90 దేశాల్లో 28 వేల మంది ఉద్యోగస్తులతో కంపెనీ వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పాదన చేస్తుందని అన్నారు. మొక్కజొన్న తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగాసింజంట ఉత్పత్తి సాధిస్తుందన్నారు రైతాంగం మా కంపెనీ యొక్క పనితీరును అవగాహన కల్పించుకుని మొక్కజొన్న సాగులో మెలకువలు తీసుకుని అధిక దిగుబడి పొందాలని కోరారు. అనంతరం మండలంలో అధిక దిగుబడి సాధించిన రైతులను శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గుండాల ప్రముఖ వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు, మానాల ప్రణీత్ ,పి ఎం మహేష్ డి ఎం రాంభూపాల్, పీఎం నవీన్ నాయక్.సింజంట సిబ్బంది . గుంటూరు,ఏలూరు, సిబ్బంది మండలంలోని ఉత్తమ రైతులు పాల్గొన్నారు.









