+91 95819 05907

ఇందిరమ్మ ఇండ్ల సర్వే లిస్ట్ లను 26 గ్రామపంచాయతీ కార్యాలయాలలోని నోటీసు బోర్డులలో తక్షణమే పెట్టాలి:

★ఇందిరమ్మ గ్రామ కమిటీలు సూచించిన లిస్టులు న్యాయబద్ధంగా లేదు

★గ్రామ కమిటీలు ఇచ్చిన లిస్టును రద్దుచేసి రీ సర్వే నిర్వహించాలి

★ఇందిరమ్మ ఇండ్ల సర్వే లిస్ట్ లను 26 గ్రామపంచాయతీ కార్యాలయాలలోని నోటీసు బోర్డులలో తక్షణమే పెట్టాలి.

★ చర్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లో చాలా మంది నిరుపేదల పేర్లు లేకపోవడం దుర్మార్గం.

★ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకా,లేక పకడ్బందీ ఇల్లు ఉన్నోలకా.

★పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందకపోతే ఉద్యమాలు తప్పవ్.

★బహుజన్ సామాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ డిమాండ్.
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:

చర్ల మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం పార్టీ చర్ల మండల కోశాధికారి పంబి కుమారి అధ్యక్షతన ఆదివారం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కొండా కౌశిక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పధకం నిజమైన నిరుపేదల కోసమా కాదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చర్ల మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు నిజమైన నిరుపేదలు చాలా మంది ఎంపిక కాకపోవడం దుర్మార్గం,బాధాకరం అన్నారు. గ్రామస్థాయిలలో ఇందిరమ్మ కమిటీల కుట్రలకు నిజమైన లబ్ధిదారులు బలవుతున్నారని అన్నారు గ్రామ కమిటీలు సూచించిన లిస్టు న్యాయబద్ధంగా లేదని విమర్శించారు నిజమైన నిరుపేదలకు రాని ఇల్లు పకడ్బందీగా ఇల్లు ఉన్నవాళ్ల పేర్లను ఎలా చేరుస్తారని ఆయన మండిపడ్డారు తక్షణమే సర్వే జరిపిన లిస్టులను చర్ల మండలం లోని 26 గ్రామపంచాయతీ కార్యాలయాలలో నోటీసు బోర్డులో పెట్టాలని తద్వారాగే గ్రామాలలో ఉన్న నిజమైన అర్హులు అనర్హులు ఎవరనేది బహిర్గతం అవ్వుతుందని అన్నారు. తద్వారా నిజమైన నిరుపేదలను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయొచ్చని తెలిపారు బహుజన్ సమాజ్ పార్టీ పలు గ్రామాలలో సందర్శించిన క్రమంలో స్థానిక పేద ప్రజలు మాకు అన్యాయం జరిగిందంటూ ఇందిరమ్మ ఇండ్ల లిస్టులలో మా పేర్లు లేవంటూ మా పార్టీ దృష్టికి చెప్తూ గోడు వెళ్లబుచ్చారన్నారనీ తెలిపారు ఒకపక్క తెలంగాణ సర్కార్ నిజమైన అర్హులకు మాత్రమే ఈ పథకం అందాలని , అనర్హులకు ఈ పథకాన్ని ఎంపిక చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని అలాగే అనర్హులకు ఇండ్లు ఎంపిక చేస్తే ఆ ఇండ్లని మధ్యలోనే నిలుపుదల చేస్తామని సర్కారు చెప్పిన మాట మార్చారా అని ఆయన గుర్తుచేశారు. బహుజన సమాజ్ పార్టీ పేద ప్రజల పొట్ట కొడితే చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ఇట్టి విషయంలో స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోని నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించి నిరుపేదల బ్రతుకుల్లో వెలుగు కాంతులు నింపాలని ఆయన కోరారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చెయ్యనియెడల బాధిత ప్రజానీకాన్ని మొత్తాన్ని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల ఉపాధ్యక్షులు చెన్నం మోహన్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏకుల వెంకటేశ్వర్లు, గౌర్ల సూరమ్మ, అయినవోలు శ్రీను, నక్క సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !