*దళితులపై కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా తిరుగుబాటు పోరాటాలు మెదక్ జిల్లాలో ప్రజాసంఘాల ప్రతిపక్షాలతో త్వరలోనే నిర్వహిద్దాం*
k
హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మే 19.
మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం లో సోమవారం ఎమ్మార్పీఎస్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా
ఎమ్మార్పీఎస్ జాతీయ సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, ఎంఎస్పి మెదక్ జిల్లా అధ్యక్షులు ఉశన్నగల్ల మురళి మాదిగ,మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అశోక్, ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అస్ర్తగల బాలరాజు మాదిగ,డి బి ఎఫ్. జిల్లా కార్యదర్శి దుబాషి సంజీవులు ఎల్ హెచ్ పి ఎస్ గోపాల్ నాయక్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లేశం మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం పనితీరుపై మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మహనీయుల భావాలను అవమానపరిచే విధంగా జిల్లాలో అణగారిన వర్గాల ప్రజలపై వివక్షత కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు పుర్ర ప్రభాకర్ నర్సింలు మరియు ఇతర దళిత సంఘాల నాయకులు మాసాపేట మల్లేశం, పాతూరి రాజు, కొండి సామి,దండోల సామిల్, గోపాల్, కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు జరిగిన ధర్నాలో మాట్లాడుతూ మెదక్ జిల్లాలో అంబేద్కర్ భవనం అధికారికంగా ఏర్పాటు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు అన్ని కుల సంఘాల భవనాల మాదిరిగా సామాజిక న్యాయం పరంగా అంబేద్కర్ భవనం కూడా యధావిధిగా నిర్మించాలని నిబంధనలు పరంగా నిర్మించకపోవడం పై అర్థం కావడం లేదన్నారు. మరియు ఐదు సంవత్సరాలుగా నిలిచిపోయిన
మెదక్ రామ్ దాస్ చౌరస్తా జిల్లా కేంద్రంలో మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని పునప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. విగ్రహాలపై నిక్షేపం మున్సిపల్ అధికారులకు లేదని
ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అలసత్వం వీడి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మహనీయుని పేరిట నిర్మించబోయే రెండు ఎకరాలలో విశాలమైన భవనం తక్షణమే నిర్మించాలని మరియు విగ్రహాన్ని మెదక్ మున్సిపల్ కార్యాలయం అధికారులు అధికారికంగా విగ్రహాన్ని యధావిధిగా ఒప్పంద ప్రకారం పునప్రతిష్టించాలని నాయకులు డిమాండ్ చేశారు. విగ్రహ నిర్మాణ పనులు ఇప్పటికైనా ఎలాంటి జాప్యం లేకుండా నిర్మించాలన్నారు. ఐదు సంవత్సరాలుగా మెదక్ మున్సిపల్ కార్యాలయానికి పరిమితమైంది అన్నారు. అంబేద్కర్ విగ్రహం పట్ల నిర్లక్ష్య వైఖరి తప్ప బాధ్యత గల పనితీరు ఏమాత్రం కనబడటం లేదన్నారు. మహనీయుని విగ్రహం పట్ల నిర్లక్ష్యం తప్ప మరొకటి లేదన్నారు. వారి పనితీరు దౌర్భాగ్యస్థితి అన్నారు. విగ్రహాన్ని ప్రతిష్టించకుండా ఈ విధంగా వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. విగ్రనిర్మానాన్ని అడ్డుకోవడం దురదృష్టం అన్నారు. గత పాలకమండలిలో ఎక్కడి విగ్రహాలు అక్కడే
ప్రతిష్టించాలని మెదక్ మున్సిపల్ కౌన్సిలింగ్ తీర్మానంలో భాగంగా ప్రతిష్ట కార్య చరణ ఆచరణలో అంబేద్కర్ భవనం నిర్మించి ఇవ్వాలి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు.డాక్టర్ జగ్జీవన్ రామ్, బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించేందుకు తక్షణ చర్యగా బాధ్యత వహించాలన్నారు.లేకుంటే అణగారిన వెనుకబడిన వర్గాల సంఘాల ప్రజలు అంతా కలిసి ఉద్యమాలు చేస్తామన్నారు.
దళితులకు తరతరాలుగా వస్తున్న మూఢనమ్మకాలు మతం కులం దళితులను హింసిస్తున్నారని అదే విధంగా నేడు వివక్షత ఇంకా ప్రదర్శింపబడుతున్నాయని దురదృష్టకరమైన దుస్థితి అన్నారు. అంబేద్కర్ భవనం నిర్మాణానికి జాప్యం జరుగుతుందన్నారు. అధికారులు ప్రతినెల పౌర హక్కుల దినం జరపాలని ఉన్నప్పటికీ ఎక్కడ జరపడం లేదని తెలిపారు. ప్రభుత్వం యొక్క చట్టాల పైన ప్రభుత్వ అధికారులకు అవగాహన లేకుంటే సామాన్య ప్రజలకు సామాజిక అంశాలు పైన ప్రజలకు ఏమి అర్థమవుతుందని అన్నారు. అంబేద్కర్ గురించి కొందరు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరని అటువైపు ప్రభుత్వ ఇకనైనా యంత్రాంగం ప్రజలకు అవగాహనపరిచే ప్రయత్నించే పరిస్థితులు లేదన్నారు . మెదక్ స్థానిక మున్సిపల్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే జిల్లా వ్యాప్తంగా పోరాటాలు ఉద్యమ ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.









