వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసిన సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే, 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు మనవరాలు బిర్రం హేమశ్రీ జన్మదిన వేడుకలను అశ్వారావుపేట పట్టణంలోని అమ్మ సేవా సదనం లో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ చేసి వృద్ధాశ్రమంలో ఉన్న 28 మంది వృద్ధులకు పండ్లు, వస్త్రాలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో అమ్మ సేవాసదనం నిర్వాహకురాలు అనసూయ మాట్లాడుతూ అమ్మ సేవాసదనంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు సేవాసదనం తరపున కృతజ్ఞతలు తెలియజేసారు. ఇలాగే జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని దీవించారు.
Post Views: 67









