నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే, 19: హైదరాబాద్ నాంపల్లి కేర్ ఆసుపత్రిని సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సందర్శించారు. ఈ సందర్బంగా అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం, గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి దమ్మపేట మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన రఘు, గుండె సంబందిత వ్యాధితో బాధపడుతూ ట్రీట్మెంట్ పొందుతుండగా వారిని పరామర్శించి ఆరోగ్య వివరాలు డాక్టర్ల ద్వారా తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయుకులు ముబారక్ బాబా తదితరులు పాల్గొన్నారు.
Post Views: 64









