+91 95819 05907

మాకు ఓటు వేయలేదు? మా కుక్కర్ లు మాకు ఇచ్చేయండి

ఓటెయ్యలేదని కుక్కర్లు వాపస్ అడిగిన నేత: అశ్వరావుపేటలో ఓటర్ల వినూత్న నిరసన

మా ఆత్మగౌరవం ముఖ్యం.. కుక్కర్లు తీసుకెళ్లండి అంటూ పదో వార్డు ప్రజల ఆందోళన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో ఎన్నికల వేళ పంపిణీ చేసిన ‘నజరానాల’ పర్వం ఇప్పుడు వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ అభ్యర్థి హరిబాబు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గతంలో ప్రతి ఇంటికీ ఒక ప్రెషర్ కుక్కర్‌తో పాటు ఓటుకు రూ. 2500 చొప్పున పంపిణీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, పోలింగ్ ముగిసిన అనంతరం తాను ఓడిపోతాననే భయం పట్టుకోవడంతో, సదరు నేత తన అనుచరులతో కలిసి ఓటర్ల ఇళ్లకు వెళ్లి “మాకు ఓటు వేయలేదని సమాచారం ఉంది, కాబట్టి మేము ఇచ్చిన కుక్కర్లను, డబ్బును తిరిగి ఇచ్చేయాలి” అని హుకుం జారీ చేశారు. ఈ వింత ధోరణికి నిరసనగా పదో వార్డు ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కుక్కర్లన్నింటినీ రోడ్డుపైకి తీసుకువచ్చి రాస్తారోకో నిర్వహించారు. “ఓటు వేయలేదన్న నెపంతో ఇచ్చిన వస్తువులను వెనక్కి అడగడం మా ఆత్మగౌరవాన్ని కించపరచడమే” అని మండిపడ్డ ఓటర్లు, కౌంటింగ్ కంటే ముందే తమను దోషులుగా నిర్ధారించడంపై అసహనం వ్యక్తం చేస్తూ కుక్కర్లను అక్కడే పడేసి వెళ్లారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కార్మిక చట్టాలలో చేసిన మార్పులను రద్దు చెయ్యాలి

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెను పినపాక మండలంలో కార్మిక–కర్షక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, రైతు సంక్షేమం, ప్రజా రంగ సంస్థల పరిరక్షణ వంటి అంశాలపై

Read More »

మాకు ఓటు వేయలేదు? మా కుక్కర్ లు మాకు ఇచ్చేయండి

ఓటెయ్యలేదని కుక్కర్లు వాపస్ అడిగిన నేత: అశ్వరావుపేటలో ఓటర్ల వినూత్న నిరసన మా ఆత్మగౌరవం ముఖ్యం.. కుక్కర్లు తీసుకెళ్లండి అంటూ పదో వార్డు ప్రజల ఆందోళన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది

Read More »

Neemsticks: మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే!

మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే! నేటి గదర్ వెబ్ డెస్క్: ప్రకృతి ప్రసాదించిన వేప పుల్లల విలువ ఇప్పుడు విదేశాల్లో అమాంతం పెరిగిపోయింది. అమెజాన్ వంటి షాపింగ్

Read More »

అమెరికాలో చనిపోయిన అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించిన సియాటెల్ నగర యంత్రాంగం

అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన కర్నూలు అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం 2023 జనవరిలో సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవి(23) అనే యువతిని ఢీకొట్టిన పోలీస్ పెట్రోలింగ్ కారు అనంతరం

Read More »

పోలీస్ స్టేషన్లో బైఠాయించిన ఆ పార్టీ ఎమ్మెల్యే ★సీఐ క్షమాపణ చెప్పే వరకు కదిలేదిదని నిరసన

పాల్వంచలో దొంగ ఓటు పాల్వంచలో హైటెన్షన్.. పోలీస్ స్టేషన్ ముట్టడి మున్సిపల్ ఎన్నికల వేళ పాల్వంచ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ మహిళను దొంగ ఓటు ఆరోపణతో గంటల తరబడి

Read More »

బ్యాలెట్ బాక్సులు వెళ్లాల్సింది కౌంటింగ్ సెంటర్ కు పోలీస్టేషన్ కు కాదు ◆మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫేయిల్ : రేగా

నేటి గదర్ వెబ్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: బ్యాలెట్ బాక్సులు వెళ్లాల్సింది కౌంటింగ్ సెంటర్ కు పోలీస్టేషన్ కు కాదు … మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫేయిల్ అని భద్రాద్రి కొత్తగూడెం

Read More »

 Don't Miss this News !