మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే!
నేటి గదర్ వెబ్ డెస్క్:
ప్రకృతి ప్రసాదించిన వేప పుల్లల విలువ ఇప్పుడు విదేశాల్లో అమాంతం పెరిగిపోయింది. అమెజాన్ వంటి షాపింగ్ సైట్స్‌లో 20 వేప పుల్లల ప్యాక్ ధర దాదాపు రూ.160 వరకు పలుకుతోంది. అదే అమెరికా వంటి దేశాల్లో ఆర్గానిక్ టూత్ బ్రష్ పేరుతో వీటిని ఏకంగా రూ.2వేల వరకు విక్రయిస్తుండటం విశేషం. ప్రకృతి సిద్ధమైన జీవనశైలి వైపు మళ్లుతున్న విదేశీయులు ఇప్పుడు వేప పుల్లలతో పళ్ళు తోముకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వేపలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు చిగుళ్లను దృఢపరిచి, నోటి దుర్వాసనను అరికడతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. మనం చిన్నచూపు చూసే మన సంప్రదాయ పద్ధతులకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. నేచురల్ ఓరల్ కేర్ లో వేప పుల్లలకు మించిన ఆప్షన్ లేదని టెక్ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.








