నేటి గదర్ వెబ్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:
బ్యాలెట్ బాక్సులు వెళ్లాల్సింది కౌంటింగ్ సెంటర్ కు పోలీస్టేషన్ కు కాదు … మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫేయిల్ అని భద్రాద్రి కొత్తగూడెం బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు దుయ్యబట్టారు.
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వేళ 10 బ్యాలెట్ బాక్సులు గల్లంతు కావడం ఆందోళనకు దారి తీసింది. పాత పాల్వంచలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారని బీ ఆర్ ఎస్ శ్రేణులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేగా కాంతారావు తన అనుచరులతో కలిసి పాల్వంచ ఠాణా ఎదుట బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Post Views: 26








