ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ :
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
జిల్లాలోని 5 మునిసిపాలిటీలలో మొత్తం పోలింగ్ 82.50 శాతం నమోది
నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ఖమ్మం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో 5 మున్సిపాలిటీలలోని 116 వార్డులకు జరిగిన పోలింగ్ లో మొత్తం 82.50 శాతం ఓటింగ్ నమోదైందని అన్నారు. ఉదయం 9 గంటల వరకు 15.37 శాతం, 11 గంటల వరకు 37.10 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 59.41 శాతం పోలింగ్ నమోదైందని, సాయంత్రం 3 గంటల వరకు 72.93 శాతం పోలింగ్ నమోదైందని, 5 గంటల వరకు 82.30 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, మొత్తంగా ఖమ్మం జిల్లాలో 1,41,875 మంది ఓటర్లకు గాను 117043 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోగా, ఇందులో 55,506 మంది పురుష ఓటర్లు, 61,520 మంది మహిళా ఓటర్లు, 17 మంది ఇతరులు ఉన్నారు. మొత్తంగా జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 82.50 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు.పోలింగ్ జరిగిన ఏదులాపురం మున్సిపాలిటీలో 85.45 శాతం, వైరా మున్సిపాలిటీలో 83.71 శాతం,
సత్తుపల్లి మున్సిపాలిటీలో 77.81 శాతం,
కల్లూరు మున్సిపాలిటీలో 87.08 శాతం,
మధిర మున్సిపాలిటీలో 78.19 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కలెక్టరెట్ నుంచి నిరంతరం మానిటరింగ్ చేయడం జరిగిందని అన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పురపాలక ఎన్నికల్లో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి జలగం నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంను తనిఖీ చేసి ఓటింగ్ సరళిని పరిశీలించి, పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కల్పించిన వసతులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు పవన్ కుమార్ కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ను పరిశీలించారు.
వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ లో డిఆర్ఓ పద్మశ్రీ, సిపిఓ శ్రీనివాస్, టెక్నీకల్ మేనేజర్ హనుమా చారి, ఈడిఎం దుర్గాప్రసాద్, టెక్నికల్ టీం సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.








