పాల్వంచలో దొంగ ఓటు
పాల్వంచలో హైటెన్షన్.. పోలీస్ స్టేషన్ ముట్టడి
మున్సిపల్ ఎన్నికల వేళ పాల్వంచ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ మహిళను దొంగ ఓటు ఆరోపణతో గంటల తరబడి స్టేషన్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ MLA కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీపీఐ శ్రేణులు స్టేషన్ ను ముట్టడించాయి. ఈ విషయమై ప్రశ్నించిన తమ నేతతో సీఐ సతీష్ దురుసుగా ప్రవర్తించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదని ఎమ్మెల్యే.. స్టేషన్ ఆవరణలోనే బైఠాయించారు.
Post Views: 24








