+91 95819 05907

సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు: జవహర్ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

​వైజ్ఞానిక ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులు.. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణపై అవగాహన

నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 28: స్థానిక అశ్వారావుపేట పట్టణంలోని జవహర్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకురాలు సంతపూరి భారతీదేవి, ప్రిన్సిపాల్ ఎస్. మైధిలి, మరియు కరస్పాండెంట్ ఐ. ప్రవీణ్ కుమార్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. 1928 ఫిబ్రవరి 28న సర్ సి.వి. రామన్ ‘రామన్ ఎఫెక్ట్’ను ఆవిష్కరించి నోబెల్ బహుమతి సాధించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు సైన్స్ పట్ల మక్కువ పెంచేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల వర్కింగ్ మోడల్స్, సోలార్ సిస్టమ్ ప్రయోగాలు మరియు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించే ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, పాఠశాలలోని అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు విద్యార్థుల మేధాశక్తిని పదును పెడుతున్నాయని, భవిష్యత్ అంతా సైన్స్‌పైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ప్రస్తుత సామాజిక సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడతాయని వారు ప్రశంసించారు. అనంతరం ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు: జవహర్ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

​వైజ్ఞానిక ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులు.. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణపై అవగాహన నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 28: స్థానిక అశ్వారావుపేట పట్టణంలోని జవహర్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ

Read More »

అశ్వారావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

ములకలపల్లి మండలంలో సుడిగాలి పర్యటన.. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, చెక్కుల పంపిణీ. నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,

Read More »

అమర జవాన్ కేశవరెడ్డికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 28: దేశ సేవలో తరించిన ఆర్మీ జవాన్ మారం కేశవరెడ్డి మృతి తీరని లోటని, వారి త్యాగం మరువలేనిదని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్

Read More »

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి : మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలోని ఆరో వార్డులో గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, గ్రామ కార్యదర్శి చిరంజీవి, ఆరవ వార్డు సభ్యులు గంధం ఇందిర ఆధ్వర్యంలో ముమ్మరంగా

Read More »

ఆర్ అండ్ బి అధికారులు.. *ప్రజల ప్రాణాలను కాపాడండి..!

* నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి : ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారి అయిన మత్కేపల్లి బస్ స్టాప్ వద్ద ముదిగొండ మండలానికి,జగన్నాధపురం గ్రామానికి మరియు చింతకాని మండలానికి వెళ్లే రింగ్ వద్ద నూతనంగా

Read More »

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య కరపల్లి నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి సుమంత్ కారేపల్లి మండలం మొట్లగూడెం చింతలపాడు గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్

Read More »

 Don't Miss this News !