+91 95819 05907

ముమ్మరంగా సామాజిక, ఆర్థిక సర్వే : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఫిబ్రవరి 24న భూదాన్ భూములలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని 21 మంది తహశీల్దార్లకు సంబంధిత వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేయగా, ఇప్పటి వరకు ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన 182 మంది, ఖమ్మం జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు 340 మంది ఉన్నారని, అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందినవారు 107 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ముగ్గురు ఉన్నట్లు తెలిపారు.
సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, యుద్ధప్రాతిపదికన పూర్తికి చర్యలు చేపట్టినట్లు, పూర్తి అయిన తర్వాత అర్హులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నివాస స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుకు చర్యలు చేపడతామన్నారు. సర్వే కు సంబంధించిన వ్యక్తులు, వారి వారి గ్రామాల్లో అందుబాటులో ఉండి, సామాజిక, ఆర్థిక సర్వేకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ముమ్మరంగా సామాజిక, ఆర్థిక సర్వే : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఫిబ్రవరి 24న భూదాన్ భూములలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా జరుగుతుందని

Read More »

భూదాన భూమి బాధితులకు అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి

భూదాన భూమి బాధితులకు అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి ______ వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి నేటి గదర్ న్యూస్, ఖమ్మం :

Read More »

ఖమ్మంలో కాంగ్రెస్ సర్కార్ రాక్షస క్రీడ.

ఖమ్మంలో కాంగ్రెస్ సర్కార్ రాక్షస క్రీడ. * వెలుగుమట్లలో కన్నీటి ఘోష.. పాలకుల పతనానికి నాంది! * వినోబా భావే దానమిచ్చిన భూమిలో పేదలకు స్థానం లేదా? * బడాబాబుల ఆక్రమణలు వదిలేసి, పేదల

Read More »

భూదాన్ భూముల బాధితుల తరఫున జిల్లా జాయింట్ కలెక్టర్‌కు లేఖ అందజేసిన: తీన్మార్ మల్లన్న

* నేటి గదర్ న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల వ్యవహారంలో ఇళ్లు కోల్పోయిన పేద బీసీ కుటుంబాల తరఫున ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ & TRP పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న

Read More »

వెలుగుమట్ల బాధితులకు వెంటనే న్యాయం చేయాలి కూల్చిన చోటే ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి.

వెలుగుమట్ల బాధితులకు వెంటనే న్యాయం చేయాలి కూల్చిన చోటే ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. -సిపిఎం పొలిటి బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : వెలుగు మట్ల భూ బాధితులకు

Read More »

 Don't Miss this News !